కేంద్రప్రభుత్వ తీరుతోనే ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

కేంద్రప్రభుత్వ తీరుతోనే ఆలస్యం

May 7 2026 8:02 AM | Updated on May 7 2026 8:02 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతోనే కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి, మొక్కజొన్నలను బుధవారం పరిశీలించారు. కేంద్రప్రభుత్వం ఆన్‌లైన్‌లో ట్రక్‌షీట్‌, వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ పెట్టాలని నిబంధన తేవడంతో 15 రోజులు ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. వారం పదిరోజుల్లో ధాన్యం కాంటా చేసి మిల్లులకు తరలిస్తామని, రైతులు అధైర్యపడొద్దని సూచించారు. ఆయన వెంట గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌.దినేష్‌, మున్సిపల్‌, ఏఎంసీ చైర్‌పర్సన్లు వేముల నాగలక్ష్మి, చిలుముల లావణ్య, కౌన్సిలర్‌ చీపిరిశెట్టి రాజేశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement