వెల్గటూర్: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి శనివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారితో పూజలు చేయించారు. శేషవస్త్రంతో సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్, అర్చకులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్/జగిత్యాలరూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ మండలం ఆల్యనాయక్‌తండాకు కై క తార్యనాయక్ గృహప్రవేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో రెండు వేల ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సర్పంచ్ జ్యోతి, సంతోష్, ఉపసర్పంచ్ గణేశ్, ఎంపీవో సుష్మ, మాజీ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, రాయికల్ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రావు పాల్గొన్నారు. అనంతరం సారంగాపూర్ మండలం పోతారానికి చెందిన మేకల తిరుపతి గృహాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు చీర కానుకగా అందించారు. సర్పంచులు మల్యాల శ్రీనివాస్, సొల్లు సురేందర్, శేఖర్, రమేశ్, కొలపాక రాధరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అల్లీపూర్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
రాయికల్: మండలంలోని అల్లీపూర్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవమూర్తులకు అర్చకులు నంబి వాసుదేవ సురేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు బాలె అరుణ, బాలె శ్రీరామ్, బాలె శ్రీనివాస్ వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత హాజరయ్యారు. సర్పంచ్ ఎంబారి గౌతమి, ఉపసర్పంచ్ వినయ్, అన్నదాన కమిటీ సభ్యులు మండ రవి, కొల్లూరి రాజేశ్, నాగరాజు, కట్ట రాజేశ్, కమలాకర్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
ముందస్తు నిర్ధారణతోనే క్షయ నివారణ
రాయికల్: ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయవ్యాధి నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి ఇటుకబట్టీలు, కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న కార్మికులకు శనివారం వైద్యశాఖ ఆధ్వర్యంలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తారని పేర్కొన్నారు. హెల్త్ సూపర్ వైజర్ ఇల్లెందుల శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ కడకుంట్ల భూమయ్య, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
కోరుట్లలో హిందూ సమ్మేళనం
కోరుట్ల: పట్టణంలోని అష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి ఏకలవ్య బస్తీ కోరుట్ల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. వక్తలు హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరించారు.


