పెద్ద చెరువులో హక్కులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పెద్ద చెరువులో హక్కులు కల్పించాలి

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

మెట్‌పల్లి డివిజన్‌ కోనరావుపేట కోండ్రిక్యాల పెద్ద చెరువులో చేపలు పట్టుకునే హక్కులు తమకే కల్పించాలని గ్రామానికి చెందిన గంగపుత్రులు కలెక్టరేట్‌ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహం బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తమ హక్కులు కాపాడాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోనరావుపేట కోండ్రిక్యాల చెరువును వంద ఎకరాలుగా చూపిస్తూ స్థానికేతరులకు మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి

బుగ్గారం మండలం మద్దునూర్‌ గ్రామపంచాయితీ కార్యాలయంలో గత పాలకవర్గం, ప్రత్యేక అధికారి పాలనలో జరిగిన నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ జరపాలని డీపీవో, కలెక్టర్‌, రాష్టపంచాయతీరాజ్‌ కమిషనర్‌లను మేకల అక్షయ్‌కుమార్‌ కోరారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. విచారణ జరిపి అవినీతికి పాల్పడిన పాలకవర్గం, ప్రత్యేక అధికారులతో పాటు ఫిర్యాదులపై స్పందించని జిల్లా పంచాయితీ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement