బడుల ఆస్తులకు భద్రత కల్పించాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతి పాఠశాలకు ప్రధాన గేటు వద్ద తాళాలు వేయాలి. విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
రెండు రోజులకోసారి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు విజిట్ చేయాలి.
పోలీసులు పెట్రోలింగ్ చేసే సమయంలో ఒకసారి పాఠశాల వైపు వెళ్లాలి
ముఖ్యంగా పాఠశాలల వద్ద డీఈవో, ఎంఈవోల ఫోన్ నంబర్లు డిస్‌ప్లే చేయాలి
వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు పరిశీలించాలి
కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్స్ ప్రయోగశాలలు, అటల్‌టింకరింగ్ ల్యాబ్‌లు, విలువైన పరికరాలు, వస్తువులు దొంగలించబడకుండా భద్రత తీసుకోవాలి.
క్రీడాసామగ్రి, గ్రంథాలయాలు, బుక్కులు, నీటి శుద్ధి ప్లాంట్లు, విద్యుత్ మోటార్లు చోరీకి గురికాకుండా చూసుకోవాలి
మధ్యాహ్న భోజనం బియ్యం సెలవులు పూర్తయ్యేవరకు పురుగుపట్టకుండా చర్యలు తీసుకోవాలి.
జగిత్యాల: పరీక్షలు అయిపోగానే పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటిస్తుంది. ఇది పిల్లలకు ఆనందంగా ఉన్నా.. ఉపాధ్యాయులకు మాత్రం పెద్ద తలనొప్పి వ్యవహారమే. ఏటా నెలపాటు వేసవి సెలవులు రావడంతో బడులన్నీ మూతపడతాయి. గ్రామాల్లో ఉండే కొందరు ఆకతాయిలు పాఠశాలలను టార్గెట్ చేస్తూ.. అందులో ఆటలాడటమే కాకుండా కొందరు మద్యం తాగుతూ.. సీసాలు పగులగొడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తుంటారు. బడిలో ఉన్న వస్తువులనూ చోరీ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రతి బడిలో కంప్యూటర్లు ఉన్నాయి. విలువైన వస్తువులూ తెచ్చిపెట్టారు. వీటిని ఎత్తుకెళ్లినా, ధ్వంసం చేసినా ఇబ్బందే. బడి ప్రారంభంకాగానే వచ్చే ఉపాధ్యాయులకు ఇది ఏటా తలనొప్పిగా మారుతోంది. గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల ఆస్తులు అనేకం ధ్వంసం కావడంతోపాటు, పరిసరాలను అస్తవ్యస్తం చేసేవారు కొందరు ఆకతాయిలు. గుర్తుతెలియని వ్యక్తులు కిటికిలు, తాళాలు, తలుపులు ధ్వంసం చేసేవారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలల ఆస్తుల రక్షణకు కొన్ని మార్గదర్శకాలను విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ జారీ చేశారు. ఈసారి బడుల ఆస్తులకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు 22 ఉన్నాయి. ఇందులో అనేక విలువైన వస్తువులున్నాయి. గతంలోనే సీసీ కెమెరాలు అమర్చినప్పటికీ ప్రత్యేకమైన భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. సీసీకెమెరాలు, ప్రధానోపాధ్యాయుడితోపాటు, పీడీ, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు నిరంతరం నిఘా ఉంచాలని, పాఠశాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపైనే పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఆకతాయిలకు చెక్ పెట్టేదెలా..?
ప్రభుత్వ పాఠశాలలు 33కేజీబీవీలు 16ప్రాథమిక పాఠశాలలు 705మోడల్‌స్కూల్స్ 13
భద్రత ఇలా..
చర్యలు తీసుకుంటున్నాం
జూన్ వరకు బడులకు సెలవులు
ఆస్తులు ధ్వంసం చేస్తున్న ఆకతాయిలు
రక్షణకు ప్రభుత్వం మార్గదర్శకాలు
బడుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యా యి. నిత్యం పాఠశాలలను విజిట్ చేయడంతో పాటు, పోషకులు, విద్యార్థుల సహకారం తీసుకుంటాం. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.
రాము, డీఈవో


