జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మార్కెట్‌యార్డులో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొన్న ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రవాణా చేయాల్సిన మొక్కజొన్న ధాన్యం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ముఖ్యంగా తూకం వేసిన బస్తాలు తడవడంతో బస్తాలను కిందిది మీద, మీద్ది కిందకు చేసి ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉండటం, కొనుగోళ్లు ఆగిపోవడంతో మొక్కజొన్న ధాన్యంపై రైతులు ఇంటి నుంచి కవర్లు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. తడిసిన బస్తాలను ఆరబెట్టేందుకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.


