జగిత్యాల: కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ బూతులు మాట్లాడటమేంటని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. బీజేపీ క్రమశిక్షణ పార్టీ అంటారని, మోదీ, అమిత్‌షా ఇలాగే మాట్లాడమని చెప్పారా అని ప్రశ్నించారు. మంత్రి ఇంటికి కూతవేటు దూరంలో కాల్పులు జరిపి దొంగలు బంగారం ఎత్తుకెళ్తే ఏం చేశారని నిలదీశారు. కేటీఆర్‌ను కరీంనగర్‌కు రానివ్వబోమంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దత్తత ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేటీఆర్‌పై విమర్శలు చేస్తే సహించబోమన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్‌రావు, దేవేందర్‌నాయక్ పాల్గొన్నారు.
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అనంతారంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులంటే కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అయిల్నేని ఆనందరావు, మోహన్, శ్రీపాల్, జలేందర్, రాజమల్లు, మల్లేశం, గంగాధర్, తిరుపతి, సత్తన్న పాల్గొన్నారు.


