మహిళా సాధికారతకు కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు కృషి

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

జగిత్యాలరూరల్‌: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేటలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ వివిధ రంగాల్లో ప్రభుత్వం మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, సర్పంచ్‌ దావ తిరుపతి, ఉప సర్పంచ్‌ మహేశ్‌, నాయకులు లక్ష్మీదామోదర్‌రావు, రవీందర్‌రెడ్డి, గంగాధర్‌, ఎంపీడీవో విజయలక్ష్మీ, తహసీల్దార్‌ రాంమోహన్‌, ఎంపీవో వాసవి, ఏపీఎం రాజయ్య పాల్గొన్నారు.

నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూత

నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. సారంగాపూర్‌ మండలం రేచపల్లికి చెందిన దుబ్బాక పెద్ద నర్సయ్యకి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల ఎల్‌వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, గర్వందుల గంగన్న పాల్గొన్నారు.

నష్టాల్లో ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నాం

జగిత్యాలఅగ్రికల్చర్‌: ప్రభుత్వ సంస్థలైన మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయిలు నష్ట్రాల్లో ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌లో సోమవారం నిర్వహించిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష కార్డులు అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌, వ్యవసాయ కళాశాల డీన్‌ సుజాత, శాస్త్రవేత్తలు రవి, రాకేశ్‌, ఉద్యాన శాఖాధికారిణి స్వాతి, మార్కెట్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, సర్పంచ్‌ నల్ల కవిత, ఉప సర్పంచ్‌ సత్తిరెడ్డి, ఏఈవో హరీశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement