జాగ్రత్తలు పాటించాలి
● ఈనెల 2న బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సీతాదేవి (25) తన భర్తతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గూడూర్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రాత్రి దర్భాంగా వెళ్లే భాగ్‌మతి రైలు ఎక్కారు. టికెట్ లేకుండానే ఎస్–6 బోగీలో కూర్చున్నారు. శనివారం వేకువజామున వరంగల్ రైల్వేస్టేషన్ దాటాక సీతాదేవికి పురిటి నొప్పులు వచ్చి కూర్చున్న చోటనే సుఖప్రసవమై ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
రామగుండం: బతుకుదెరువు కోసం బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి నిరక్షరాస్యులైన దంపతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పనులు చేసుకునేందుకు వలస వెళ్తుంటారు. ఇటీవల రైలు ప్రయాణాల్లో గర్భిణులు ప్రసవించడంపై సంబంధిత అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు అనారోగ్యంతో సొంతూరు వెళ్లే క్రమంలోనే రైళ్లలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. కాగా, వీరందరూ నిరక్షరాస్యులు కావడం గమనార్హం.
మూసివేసి ఉన్న ఎమర్జెన్సీ హెల్త్ రూమ్
సూదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే కనీసం రైల్వే ప్లాట్‌ఫాంపై ప్రాథమిక వైద్య సేవలు అందించని దుస్థితిలో రామగుండం రైల్వేశాఖ ఉంది. ప్రాథమిక చికిత్స కోసం అత్యవసర గదిని ఏర్పాటు చేసి బోర్డు తగిలించినా తెరుచుకున్న పాపానా పోలేదు. అమృత్ భారత్ పథకంలో కోట్లాది నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా.. ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించలేని దుస్థితిలో రైల్వేస్టేషన్ ఉంది.
అవగాహన లేమితో నిండు గర్భిణుల రైలు ప్రయాణం
రామగుండం రైల్వేస్టేషన్‌లో రెండు ఘటనలు
స్టేషన్‌లో అత్యవసర వైద్యసేవలు కరువు
నెలలు నిండిన గర్భిణులు, అస్వస్థతతో ఉన్న వ్యక్తులు రైళ్లలో ప్రయాణం చేయడం సరికాదు. అత్యవసరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పెద్ద సిటీలలో వైద్య సేవలకు అనుకూలత ఉంటుంది. అటవీ ప్రాంతం సమీపంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే రైలు ప్రయాణాలు చేయాలి.
– తిరుపతి, ఇన్‌చార్జి రైల్వే పోలీస్, రామగుండం


