కోరుట్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని ఎమ్మెల్యే ఫొటో, జగిత్యాలలో ఎమ్మెల్యే ఫొటోతో ఉన్న ఫ్లెక్సీ
జగిత్యాల: జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి పట్టణాల్లో ప్రజాపాలన–పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం నిర్వహించారు. జగిత్యాల, ధర్మపురిలో జరిగిన సమావేశాల్లో అధికార యంత్రాంగం స్థానిక మంత్రి, ఎమ్మెల్యేల ఫొటోలను ఫ్లెక్సీల్లో వాడుకున్నారు. కోరుట్లలో మాత్రం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫొటో మాత్రం పెట్టలేదు. జిల్లా అధికారులు అందరికీ ఒకే ప్రోటోకాల్ అనుసరించకుండా ఇలా వివక్ష చూపడంపై కోరుట్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


