డంపింగ్‌ యార్డు తరలించండి | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌ యార్డు తరలించండి

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

మాది నూకపెల్లి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీ. కాలనీకి అతి సమీపంలోని మున్సిపల్‌ డంపింగ్‌యార్డు ఉంది. యార్డుకు తరలిస్తున్న టన్నుల కొద్దీ చెత్తతో దుర్వాసన వస్తోంది. వ్యర్థాలకు నిప్పు పెడుడతుండటంతో ఎగిసి పడుతున్న మంటల కారణంగా విషపూరితమైన పొగ, దుమ్ము, దూలితో రోగాల బారిన పడుతున్నాం. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. డంపింగ్‌ యార్డు తరలించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో డంపింగ్‌ యార్డుకు గోడ నిర్మించే పనులు మొదలు పెట్టారు. గోడపెట్టినా దుర్వాసన, పొగతో ఇబ్బందులు తప్పవు. కాలనీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోడ నిర్మాణం కాకుండా డంపింగ్‌ యార్డును శాశ్వతంగా తొలగించి, దూర ప్రాంతానికి తరలించండి.

Advertisement
 
Advertisement
Advertisement