బన్నీ వేసవి యాత్ర–7 | - | Sakshi
Sakshi News home page

బన్నీ వేసవి యాత్ర–7

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

వేప పుల్ల, ఆవు పాలు

ఉదయం అయ్యింది.

కొక్కొరోకో అని కోడి కూసింది.

బన్నీకి మెలకువ వచ్చింది.

పక్కన చూశాడు.

రామ్‌, చుక్క, స్వప్న లేచారు.

అందరూ శుభోదయం చెప్పుకున్నారు.

నానమ్మ దగ్గరకు వచ్చింది.

చేతిలో ఒక పుల్ల.

ఇది వేప పుల్ల రా బన్నీ అంది.

దీంతో పళ్ళు తోము.్ఙ అన్నది.

బన్నీ మొహం చిట్లించాడు.

కోల్గేట్‌ లేదా? అన్నాడు.

తాతయ్య నవ్వాడు.

ఇదే మన పాత పేస్ట్‌ రా. పంటికి బలం. అన్నాడు.

బన్నీ వేప పుల్లతో పళ్ళు తోమాడు.

కొంచెం చేదు. కానీ ఫ్రెష్‌గా ఉంది.

తర్వాత తాతయ్య బన్నీని కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు.

అక్కడ ఒక ఆవు. పేరు లక్ష్మి.

ఇది మన లక్ష్మ్ఙి అన్నాడు తాతయ్య.

తాతయ్య పాలు పితికాడు.

బన్నీ చూస్తూ ఉన్నాడు.

నానమ్మ పాలను వేడి చేసి, ఒక గ్లాసులో పోసి బన్నీకి ఇచ్చింది.

బన్నీ తాగాడు.

చక్కెర వెయ్యలేదు.

అయినా తియ్యగా ఉన్నాయి.

‘ఎందుకు నానమ్మా?’ అన్నాడు బన్నీ.

నానమ్మ నవ్వింది.

‘ప్రేమ కలిపానురా కన్నయ్యా... అందుకే తియ్యగా ఉన్నాయి’. అన్నది.

బన్నీకి ఆశ్చర్యం.

ప్రేమకి రుచి ఉంటుందా?

పిల్లలకి మాట:

పాలు ప్యాకెట్‌లో రావు.

ఆవు, గేదెల నుంచి వస్తాయి.

ప్రేమతో రుచి పెరుగుతుంది.

డాక్టర్‌ కోట లక్ష్మణ్‌,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి,

మండలం: మంథని,

పెద్దపల్లి జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement