రైతులు అధైర్య పడొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు అధైర్య పడొద్దు

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

● తడిసిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కొంటాం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్‌: రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మార్కెట్‌యార్డులో ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.జగిత్యాల మార్కెట్‌యార్డులో అకాల వర్షానికి తడిసిన వరి, మొక్కజొన్న ధా న్యాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి పరిశీ లించారు. పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడంతో ఆ భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఆదాయం సమకూర్చుకోవాలనే ముందుచూపుతో ముఖ్యమంత్రి ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిచేస్తున్నారని తెలిపారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఫ్యూచర్‌ సిటీపై చేసిన వ్యా ఖ్యలు సమంజసం కాదన్నారు. మంత్రి వెంట కలెక్ట ర్‌ సత్యప్రసాద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాణి, మా ర్కెట్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, నాయకులు పాల్గొన్నారు.

కేంద్రం తీరుతోనే కొనుగోలులో ఆలస్యం

పెగడపల్లి: కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల వల్లనే ధాన్యం కొనుగోలులో ఆలస్యమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. పెగడపల్లి మండలం ఆరవెల్లిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కుప్పలను పరిశీలించారు. తూకంలో తేడా, ధాన్యంలో తరుగు పేరిట మిల్లర్లు సతాయిస్తే నిర్వాహకులు సంబంధిత అధికారులకు తెలుపాలని కానీ రైతులను మిల్లర్ల వద్దకు పంపవద్దని సూచించారు.

పశు పోషణపై దృష్టి సారించాలి

పశు పోషణపై దృష్టి సారించి అదనపు ఆదాయం గడించాలని మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ రైతులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని మద్దులపల్లిలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన పశుబీమా పునరుద్ధరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పునరుద్ధరణ అయ్యేలా కృషి చేస్తానన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులు చేపట్టాలి

ధర్మపురి: మండలంలోని నేరెల్ల శివారులో నిర్మిస్తు న్న యంగ్‌ ఇండియా ఇంటి గ్రేటెడ్‌ స్కూల్‌ పనుల ను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం పనులు జరుగుతున్న తీరును పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పనులు చేపట్టాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement