ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

జగిత్యాలరూరల్‌: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. సారంగాపూర్‌, రేచపల్లి, లచ్చనాయక్‌ తండా, నాగునూర్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో డాటా ఎంట్రీ చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని సూచించారు. ఽఆయన వెంట ఆర్డీవో మధుసూదన్‌, డీఆర్డీవో రఘువరన్‌, తహసీల్దార్‌ వహిదోద్దీన్‌ ఉన్నారు.

ప్రక్రియ సక్రమంగా సాగాలి

జగిత్యాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, డీఎస్పీలతో సమావేశమయ్యారు. 24 గంటల్లో మిల్లుల్లో అన్‌లోడ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. ట్రాన్స్‌పోర్టు, పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్‌ అధికారులు సమన్వయంతో చేయాలని ఆదేశించారు. సమస్యలపై కాల్‌సెంటర్‌, టోల్‌ఫ్రీ నంబరు 1800 425 8187 ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. కేంద్రాల వద్ద భద్రత చేపట్టామన్నారు. అడిషనల్‌ ఎస్పీ చేతన్‌ నితిన్‌, అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్‌, ఆర్డీవోలు పాల్గొన్నారు.

బక్రీద్‌ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

బక్రీద్‌ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ అన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి మత పెద్దలతో సమావేశమయ్యారు. మసీదుల వద్ద శానిటేషన్‌ చేపట్టాలని, మున్సిపల్‌ కమిషనర్లు, సెక్రటరీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల రవాణా, సర్టిఫికేషన్‌ విషయంలో వెటర్నరీ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సోషల్‌ మీడియాపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement