కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చాం. నాపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి చేశా. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేశాను. ఎంపీ ధర్మదీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారు.
– సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే
18న దీక్ష
స్థలం కేటాయింపులో జగిత్యాల ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించాను. స్థలం కేటాయించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు. అందుకే ధర్మదీక్ష చేస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం అందరికీ అనుకూలమైన ప్రాంతంలో ఉంటే బాగుంటుంది.
– ధర్మపురి అర్వింద్, ఎంపీ


