● 2,490 మంది అభ్యర్థులు
● 8 కేంద్రాలు ఏర్పాటు
జగిత్యాల: మూడేళ్ల డిప్లొమా కోసం నిర్వహించే పాలిసెట్ బుధవారం జరగనుంది. ఇందుకు జిల్లా కేంద్రంలో ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,494 మంది హాజరుకానున్నట్లు ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అరిగెల అశోక్ తెలిపారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌పై రెండువైపులా సంతకం చేయాలని, హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరైజర్, బ్లూ/బ్లాక్ పెన్ వెంట తెచ్చుకోవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో లేకుంటే ఫొటో, ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎస్‌బీ టెట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ తెలుసుకోవచ్చన్నారు. ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.


