జగిత్యాలటౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక రైతులు కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. తూకం, లోడింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌లో తీవ్ర జాప్యం జరగుతుందన్నారు. ఓ వైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు పేరుతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు విషయంలో ఎమ్మెల్యే చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బోర్నపల్లి జగన్నాథ్‌పూర్ వంతెన నిర్మాణ పనుల కోసం రూ.18కోట్లు మంజూరు కాగా, రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు మొదలు కాలేదన్నారు. జిల్లాలో అన్ని పనులు చేస్తున్న గౌరీశంకర్ ఇన్‌ఫ్రాతో టెండర్ వేయించి పనులు ప్రారంభించేలా చూడాలని ఎమ్మెల్యేకు సూచించారు. గాజుల రాజేందర్, ధర రమేశ్, మసర్తి రమేశ్, కల్లెపెల్లి దుర్గయ్య, వెంకటేశ్వర్‌రావు, చెట్‌పల్లి సుధాకర్, గుండ మధు, శీలం ప్రవీణ్ పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవడంలో విఫలం
జగిత్యాలరూరల్: మక్క రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీర్‌పూర్ మండలంలో మక్క, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మొక్కజొన్న ఎకరాన 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. నాయకులు రమేశ్, జితేందర్, మల్లారెడ్డి, శంకర్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి


