రాయికల్: విద్యార్థుల భవిష్యత్‌తో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రాజకీయం చేయొద్దని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి అన్నారు. రాయికల్ విలేకరులతో మాట్లాడారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు స్థలం కేటాయించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా స్థలం కేటాయించడం లేదని, తద్వారా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై ఈనెల15లోపు హామీ ఇవ్వకుంటే 18న ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ధర్మ దీక్ష చేపడతామని పేర్కొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుర్మా మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, రాయికల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెడ ధర్మపురి, కౌన్సిలర్లు పుర్రె శ్రీధర్, భూపతిపూర్ సింగిల్ విండో చైర్మన్ ముత్యంరెడ్డి, నాయకులు కునారపు భూమేష్, రవీందర్‌రెడ్డి, వే ముల రాము, తోపారపు సురేశ్, పటేల్ రాము, సా మల్ల సతీష్, సింగని సతీష్, విజయ్ పాల్గొన్నారు.
ఈనెల 18న ఎంపీ అర్వింద్ ధర్మదీక్ష
బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి


