● ఒకరు మృతి.. 8 మందికి గాయాలు
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని మొదటి బైపాస్ రోడ్డులో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన గోక సదానందం, అతని భార్య వినోద, కూరపాటి విజయ, కూరపాటి శ్రీకాంత్, కూరపాటి రాజేంద్రపాద్ కారులో మూడు రోజుల క్రితం హుస్నాబాద్‌లో బంధువుల పెళ్లికి వెళ్లారు. బుధవారం సిరిసిల్లకు తిరిగి వస్తుండగా మొదటి బైపాస్‌రోడ్డులో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేములవాడ రూరల్ మండలం అచ్చయ్యపల్లెకి చెందిన వేణు అతని భార్య హర్షిత, పిల్లలు సౌర్యనందన్, అనుశ్రీ గాయపడ్డారు. అదే వేగంతో కారు ముందుకు వెళ్లి చెట్టును ఢీకొట్టగా అందులో ఉన్న శ్రీకాంత్, రాజేంద్రసాద్ కాళ్లు విరిగిపోయాయి. విజయ తలకు తీవ్రగాయాలు కాగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.


