బీజేపీ సంబరాలు
జగిత్యాలటౌన్: సోమవారం వెలువడిన ఐదు రా ష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మోదీ సంక్షేమ పాలనకు స్వాగతం పలికిన బెంగాల్ ప్రజలు మమత పాలనకు చెరమగీతం పాడారని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాలరూరల్: జిల్లాలో రబీ వరిధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.60 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనున్నారు. జిల్లావ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు.
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాత కొనుగోలు చేస్తారు. తూకం వేసేందుకు ప్రతి సెంటర్‌కు ఎలక్ట్రానిక్ కాంటా, తేమ శాతాన్ని పరిశీలించేందుకు మీటర్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లను సిద్ధంగా ఉంచారు. తప్పతాళ్లు లేకుండా క్లీన్ చేసేలా ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేశారు.
76 మిల్లర్లకు ధాన్యం కేటాయింపు
ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు 76 రైస్‌మిల్లులను కేటాయించారు. మిగతా కొన్నింటికి ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని కేటాయింపు చేసే అవకాశాలున్నాయి. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు, మిల్లుల్లో కూడా వెంటనే ధాన్యాన్ని అన్‌లోడ్ చేసేలా మిల్లర్లకు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తేమశాతం ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చేలా అవగాహన
రైతులు పండించిన ధాన్యాన్ని పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రానికి కాకుండా ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నేరుగా రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ధాన్యం ఆరబెట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులకు తేమశాతం వచ్చిన ధాన్యాన్నే సెంటర్‌లోకి తీసుకురావాలని అవగాహన కల్పిస్తున్నారు.


