● వేసవిని దృష్టిలో పెట్టుకొని చెక్‌పోస్టు వరకు చలువ పందిళ్లు వేశారు. భక్తుల కోసం వైజంక్షన్ నుంచి ఆలయం వరకు దారి పొడవునా కార్పెట్లు ఏర్పాటు చేశారు.
● కొండగట్టుకు వచ్చే దారుల్లో 20 చోట్ల చలివేంద్రాలు, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
● ఉత్సవాలకు సుమారు 3లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ఇప్పటికే 4లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. నిత్యం 40వేల లడ్డూలు తయారు చేస్తున్నారు.
● భక్తుల సౌకర్యార్థం ప్రసాదాల కౌంటర్లు 24గంటలు తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. స్నానాల కోసం 10లక్షల లీటర్ల సామర్థ్యం గల సంప్‌ను సిద్ధం చేశారు. ప్రతీ 3గంటలకు ఒకసారి కోనేరులో నీటిని నింపనున్నారు. కోనేరుకు ఇరువైపులా షవర్లు ఏర్పాటు చేశారు.
● భక్తులకు అత్యవసర చికిత్స కోసం ఐదుచోట్ల వైద్య శిబిరాలు, మాల విరమణ, స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
● ఈనెల 10 నుంచి 13 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. 14 నుంచి యథావిధిగా స్వామివారి ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి.
‘అంజన్న’ జయంతి సందర్భంగా ఆలయం ముస్తాబు 3లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఈనెల 10 నుంచి 12 వరకు çßæ¯]l$-Ð]l*¯ŒS ò³§ýlª fĶæ$…†ో
మల్యాల(చొప్పదండి): అంజన్న జయంతోత్సవాలకు కొండగట్టు ఆలయం ముస్తాబైంది. విద్యుద్దీపాలు, స్వాగత తోరణాలు, చలువ పందిళ్లతో ఉత్సవ శోభ నెలకొంది. ఈనెల 10 నుంచి 12 వరకు నిర్వహించే హనుమన్ పెద్ద జయంతికి సర్వం సిద్ధం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసులు, అధికారులు, పారిశుధ్య సిబ్బందికి విధులు కేటాయించారు.
ఏర్పాట్లు ఇలా..
ఉత్సవాలకు సర్వం సిద్ధం
కొండగట్టు ఆలయంలో స్వామివారి జయంతోత్సవాలకు సర్వం సిద్ధం చేశాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశాం. లడ్డూ ప్రసాదాల కౌంటర్లు మూడు రోజులపాటు తెరిచి ఉంచుతాం. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు సహకరించాలి.
– అంజనారెడ్డి, ఆలయ ఈవో