ధర్మపురి/వెల్గటూర్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బంది కలిగించొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని నక్కలపేట, వెల్గటూర్‌లోని శాఖాపూర్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ధర్మపురి, వెల్గటూర్ తహసీల్దార్లు, శ్రీనివాస్ శేఖర్ ఉన్నారు.
స్వీయగణనలో పాల్గొనాలి
జగిత్యాల: స్వీయగణనలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ అన్నారు. ఆదివారం ఒక్కరోజే అవకాశం ఉందన్నారు. మొబైల్ ఫోన్‌లో ప్రక్రియ సులభంగా చేయవచ్చని, నచ్చిన భాష ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి
ప్రత్యేక విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచడమే లక్ష్యమన్నారు. అకాలవర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


