రంగుపడుద్ది.. | - | Sakshi
Sakshi News home page

రంగుపడుద్ది..

Mar 3 2026 7:34 AM | Updated on Mar 3 2026 7:34 AM

తేడా వస్తే

ఇటువంటి రంగులతో ప్రమాదం

కళ్లల్లో పడితే ప్రమాదం..

మార్కెట్‌లో లభిస్తున్న రంగుల్లో రసాయనాలు కలుస్తున్నాయి. ఇవి కళ్లల్లో పడితే కంటి చూపునకే ప్రమాదం. కళ్లకు రక్షణగా అద్దాలు ధరించాలి. కళ్లల్లో రంగుపడితే వెంటనే నీటితో కడిగి వైద్యులను సంప్రదించాలి. – ఎస్‌.వసంతరావు,

ఆప్థాలమిక్‌ అధికారి, రాజాం

రాజాం సిటీ: హోలీ అందరిలో ఉత్సాహం నింపుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతుంటారు. నాటి తరం జరుపుకునే వేడుకలకు నేటి యువత చేసుకుంటున్న సంబరాలకు పోలిక ఉండడం లేదు. గతంలో సహజ రంగులతో హుందాగా జరుపుకుంటే.. నేడు రసాయనాలతో తయారుచేసిన రంగులు పూసుకుంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న రంగుల్లో ప్రమాదకరమైన క్రోమియం, అల్యూమినియం, మెర్క్యురీ ఆకై ్సడ్‌లు కలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

చేయండిలా....

పలు రకాల పూలు, పండ్లతో ఇళ్లల్లోనే సహజసిద్ధమైన రంగులు తయారుచేసుకోవచ్చు. వీటితో చర్మానికి మేలు కలగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎర్ర గులాబీ, మందారం పూలు, ఎర్రచందనం, టమాటా గుజ్జు, క్యారెట్‌, బీట్‌రూట్‌లతో ఎరుపు రంగు తయారవుతుంది. పసుపు పొడి, తంగేడు, బంతి, చామంతి, తుమ్మ పూలతో పసుపురంగు ద్రావకం సిద్ధమవుతుంది. వేసవిలో విరివిగా లభించే మోదుగ పూలతో కాషాయరంగు ద్రావణం తయారుచేసుకోవచ్చు. ఎండిన గోరింటాకు పొడి లేదా పచ్చి గోరింటాకు, పాలకూర, పుదీనా, కొత్తిమీర వంటి ఆకు కూరలను మెత్తగా రుబ్బి నీరు కలిపితే ఆకుపచ్చ రంగు తయారుచేసుకోవచ్చు.

ఇవీ సూచనలు..

హోలీ ఆడడానికి ముందు శరీరానికి మాయిశ్ఛరైజర్‌ని, తలకు నూనెను రాసుకోవాలి. దీని వల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. ముఖంపై పడిన రంగులను శుభ్రంగా కడుక్కోవాలి. చాలా మంది హోలీ ఆడే సమయంలో రంగులలో ఆయిల్స్‌ కలుపుతారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. రంగుల్లో ఎలాంటి నూనెలు, నీళ్లు కలపకుండా చల్లుకుంటే మంచిది.

చిన్నపిల్లలు దూరం..

హోలీ అంటే చిన్నపిల్లల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగులు ఎలా చల్లుకోవాలో వారికి తెలియదు. నోరు, ముక్కులోకిపోయే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లలను హోలీకి దూరంగా ఉంచడం మంచిది.

– డాక్టర్‌ కె.హరిబాబు, సూపరింటెండెంట్‌, ప్రాంతీయ ఆస్పత్రి, రాజాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement