● అన్నింటా ‘ఆమె’.. | - | Sakshi
Sakshi News home page

● అన్నింటా ‘ఆమె’..

Mar 8 2026 7:13 AM | Updated on Mar 8 2026 7:13 AM

‘అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయటా!’ అని సమాజంలో మహిళల ప్రస్తుత పాత్రను వర్ణించాడు ఓ సినీ కవి. అంతగా శ్రమిస్తున్నా, ఆమెలో అలుపు రాదు.. చిరునవ్వు తప్ప! ఆమె నడిచే దారంతా వెలుగులు పూస్తాయి. అమ్మగా.. భార్యగా.. తోబుట్టువుగా.. బిడ్డగా.. ఓ కుటుంబానికి దారి దీపం ఆమె. సమాజంలో ఏ పాత్ర అయినా తనకు కొట్టిన పిండే. ఆమె లేని చోటు లేదు.. ఆమె చేయని పని లేదు.. ఆమె లేకుండా ఈ జగతే లేదు! అవనిని మోసే భూమాత సీ్త్ర. నేడు మహిళా దినోత్సవం. ఆమె గురించి ఈ ఒక్క రోజు కాదు.. ఏడాదంతా కేటాయించినా తక్కువే. అటువంటి ‘అతివ’రథ మహారథులందరికీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుదాం. – రామభద్రపురం/సాక్షిఫొటోగ్రాఫర్‌, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement