పార్వతీపురం రూరల్: ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో పెదరేల్లివీధి, ఇందిరాకాలనీ, బాలగుడబ గ్రామాల్లోని అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహించారు. నాటుసారా అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇటీవల నాలుగు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను డ్రోన్ కెమెరాల సాయంతో నిర్వహించడంతో పాటు 23 అంతర్రాష్ట్ర దాడులు చేపట్టినట్టు అధికారులు మంగళవారం తెలిపారు. సారా విక్రయాలకు పాల్పడుతున్న పెదరేల్లివీధికి చెందిన వ్యక్తిపై జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ అమలు చేసి, విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఏఎస్పీ సంతోష్ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల
నివారణకు చర్యలు
డెంకాడ: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదకర మలుపులు, ప్రాంతాల వద్ద స్టాపర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరం–విశాఖపట్నం జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు, ఏకే ఇన్‌ఫ్రా ప్రతినిధి బీబీ ప్రభూజీలు కలిసి రాజపులోవ నుంచి చింతలవలస ఏపీఎస్పీ బెటాలియన్ వరకు 26 నంబర్ జాతీయ రహదారిలోని అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం గత ఏడాది ఫిబ్రవరి 15న అపహరణకు గురైంది. అప్పట్లో వాహనం మిస్సింగ్‌పై సంతకవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు వద్ద ప్రస్తా వించగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.


