శృంగవరపుకోట : జిల్లాలో వైఎస్సార్‌సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్ర కార్యాలయం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజాం – కె.వి.వి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి – పేడాడ రమణకుమారి, బొబ్బిలి – రొంగలి జగన్నాధం, నెల్లిమర్ల – నెక్కల నాయుడుబాబు, శృంగవరపుకోట – మాజీ ఎమ్మెల్యే కొట్టుగిల్లి భాగ్యలక్ష్మి, విజయనగరం – తూముల భాస్కరరావు, గజపతినగరం – శోభా స్వాతిరాణిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని కేంద్ర పార్టీ కార్యాలయం సూచించింది.


