విజయనగరం జిల్లా కలెక్టరేట్ సాక్షిగా వివిధ వర్గాల ప్రజలు నిరసన గళం వినిపించారు. పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు రూ.9కోట్లు వెంటనే చెల్లించాలని భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 1976–77లో 16,862 మంది రైతుల షేరుధనంతో ప్రారంభమైన ఫ్యాక్టరీ ఇప్పుడు మూతపడడంతో సుమారు 300 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కలెక్టర్‌కు వివరించారు.
● టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) విషయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కలెక్టరేట్ గేట్ ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. కొత్తపేట రామమందిరం సమీపంలో సర్వే నంబర్ 107–3ఎలో 20 గజాలు టీడీఆర్‌ను శ్రీనివాసరావు కొనుగోలు చేసినప్పటికీ, అదే హక్కులను మరొకరి పేరిట వినియోగించారని నగర కార్యదర్మి రెడ్డి శంకరరావు ఆరోపించారు.
– విజయనగరం గంటస్తంభం


