రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన కల్లూరి బైరాగి (67) మెంటాడ మండలంలోని కుంటినవలస గ్రామంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి ఆదివారం ఉదయం తిరిగి స్వగ్రామానికి నడుచుకుంటూ వస్తుండగా.. సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైరాగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు హెచ్‌సీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


