పోలీస్‌ దందా..! | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ దందా..!

Mar 2 2026 7:17 AM | Updated on Mar 2 2026 7:17 AM

పోలీస

పోలీస్‌ దందా..!

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026 పోలీస్‌ దందా..! పదండి.. మన ఆస్పత్రికి..! –8లో ●చీపురుపల్లి ఎస్‌ఐ తీరుపై సర్వత్రా విమర్శలు ●దందా మరిగిన పోలీస్‌ ●గ్రామదేవత పండగలు.. కలెక్షన్‌ వేదికలు ●పెట్రోలింగ్‌ మాటున బైకుల చోరీ జూదం మీది.. లాభం నాది ఊరికి జాతర.. పోలీసులకు పండగ వట్టి జీతంతో ఎలా బతుకుతాం.. ●జూదం చట్ట విరుద్ధం.. ఎస్‌ఐకి నోటీస్‌ ఇస్తున్నాం..

పెట్రోలింగ్‌ పేరిట బైక్‌ చోరీ

న్యూస్‌రీల్‌

విజయనగరం
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

సర్వజన ఆస్పత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే వారిని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు సమాచారం.

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

‘ఊళ్లో ఒకడే రౌడీ నాకొడుకు ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి..’ అనే సినిమా డైలాగును చీపురుపల్లిలో పోలీసులు అక్షరాలా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ఏ సందర్భం వచ్చినా ‘అయితే మాకేంటి..?’ అనే కాన్సెప్ట్‌ కిందకు మార్చేసి దందా చేస్తున్నారు. గ్రామ దేవతల పండ గ వచ్చిందంటే చుట్టాలకు భోజనాలకు, మందుకు పెట్టాల్సిన ఖర్చు కన్నా పోలీసోళ్లకు ఇచ్చే మామూళ్ల ఖర్చే ఎక్కువైపోతుందని చిరు వ్యాపారాలు భీతిల్లుతున్నారు. లేదంటే జీపులో మార్కెట్లో తిరుగుతూ స్టైల్‌గా లాఠీ తిప్పుతూ సినిమా సెకలు పోతున్నార ని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఆఖరుకు నైట్‌ పెట్రోలింగ్‌ సందర్భంగా ఊళ్లో రోడ్డు పక్కన ఏదైనా బైక్‌ కనిపిస్తే దాన్ని కూడా స్టేషన్‌కు ఎత్తుకెళ్లి దాన్ని ఇవ్వడానికి రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఊళ్లో పండగల సందర్భంగా వసూళ్లకు అంతూ పంతూ లేకుండా పోతోంది.

చీపురుపల్లి మండలంలో గ్రామదేవత పండగలు.. అమ్మవారి జాతరలు ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ జాతరలు సందర్భంగా ఊళ్లో ఆటల పోటీల వంటివి నిర్వహించడం పరిపాటి. ఈ మధ్య చీపురుపల్లి కనకమహాలక్షి అమ్మవారి జాతర సందర్భంగా జాతరలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో జూదం నిర్వహించారు. బహిరంగంగా బోకు ఆటలు, గుండాట లు, ఇతర ఆటలు మూడు రోజుల పాటు యథేచ్ఛగా నిర్వహించారు. వీటిని కంట్రోల్‌ చేయాల్సిన ఎస్సై దామోదరరావు, ఆయన సిబ్బంది ఈ దందాను ఏమాత్రం చూడకుండా కళ్లకు గంత లు కట్టుకుని ఊరుకున్నారు. కట్‌ చేస్తే ఒక్కో జూదశాల నిర్వాహకుడి నుంచి భారీగానే ముడుపులు లాగేసినట్టు చీపురుపల్లిలో చెప్పుకుంటున్నారు. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం మా చిన్నప్పుడు.. ఇలాంటి పెద్ద జూదాలు ఉండేవి.. అవి కూడా ఊళ్లో ఎక్కడో చివరన.. తోటలు, కల్లాల్లో జరిగేవి.. ఇప్పుడు మూడు రోజుల పాటు రాత్రి పగలు ఊరు నడిబొడ్డున ఈ దందా చేస్తున్నారని పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మూడు రోజులూ చీపురుపల్లి పోలీసులు నిద్ర నటించినందుకు ఫీజుగా రూ.రెండు లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది.

దీంతో పాటు ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో మెట్టపల్లిలో జరిగిన గొల్లపేరంటాల అమ్మవారి జాతరలోనూ ఇలాగే బోకు ఆటలు, గుండాటలు ఆడుకునేందుకు అక్కడికి జూదశాల నిర్వాహకులు మరో రూ.2 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో శివరాత్రికి జరిగిన జాతరలో కూడా బోకు ఆటలు, రికార్డింగ్‌ డ్యాన్స్‌లు పెట్టుకోవడానికి భారీగా ఫీజు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ జూదం చూసేవాళ్లకు ఎంటర్టైనింగ్‌గా ఉన్నప్పటికీ యువత ఈ జూదానికి అలవాటు పడి ఆ నాలుగైదు రోజుల్లో రూ.వేలు.. లక్షల్లో నష్టపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.

కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర పేరు మీద కూడా పోలీసులు బాగానే దండుకున్నట్టు చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. పండక్కి బోలెడుమంది పోలీసులు వస్తారు.. అందరికీ భోజ నాలు పెట్టాలి అంటూ చిరు వ్యాపారాలు.. హోటళ్లు, లాడ్జిలు.. .బట్టల దుకాణాలు, చికెన్‌ షాపుల నుంచి భారీగా దండేసినట్టు చెబుతున్నా రు. బందోబస్తు బాధ్యత పోలీసులది అయినపుడు మానుంచి రౌడీ మామూళ్లు ఎలా వసూళ్లు చేస్తారని వ్యాపారాలు లోలోన బాధపడుతున్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఏమైనా ప్రశ్నిస్తే పోలీసు సార్‌ మళ్లీ ఏదైనా కేసు పెట్టి ఇబ్బంది పెడతారేమో అనే భయం వారిని మాట్లాడనివ్వలేదు. దీంతో పాటు చీపురుపల్లి లాడ్జీల్లో జరిగే అనైతిక కార్యకలాపాలకు సహకరించేలా లాడ్జ్‌ ఓనర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఏ లాడ్జిలో ఎవరు వచ్చి వెళ్తున్నారు.. ఎంతసేపు ఉంటున్నారు.. అనేది ఎక్కడా రికార్డ్‌ కావడం లేదు. ఈ చుట్టుపక్కల చదువుకునే కాలేజీ విద్యార్థులు దారితప్పి ఇలా గంట.. రెండు గంటలు చొప్పున లాడ్జీల్లో గడుపుతున్నా దీనిపై అక్కడా తనిఖీలు లేవు.. ఎందుకంటే ఎస్సై గారికి నెలవారీ మామూళ్లు వచ్చేస్తున్నాయి.

ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే జీతంతో బతకడం ఎస్సై గారికి కష్టమైపోతోంది.. అందుకే మైనింగ్‌ వ్యాపారాలు.. లిక్కర్‌ వ్యాపారాలు.. ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేసే వాళ్లతో సంబంధం పెట్టుకున్నారు. ఒకటో తేదీకి ప్రభుత్వ జీతం పడినా పడకున్నా ఈ వ్యాపారాలు మాత్రం తమ వాటా బుద్ధిగా స్టేషన్‌కు తెచ్చి ఇవ్వాల్సిందే. లేకుంటే సారుకు కోపం వస్తుంది. లారీల మీద కేసులు పడతాయ్‌. లిక్కర్‌ షాపులు టైం దాటాక ఓపెన్‌ చేసారంటూ కేసు రాస్తారు. ఓవర్‌ లోడ్‌ అంటూ మైనింగ్‌ వాళ్ల మీదకు పోలీసులు వెళ్తారు. అందుకే వ్యాపారులంతా గంపగుత్తగా తమ వాటా చెల్లించుకుంటూ ఆయన్ను సంతుష్టులని చేస్తున్నారు.

చీపురుపల్లి ఎస్‌ఐ దామోదర్‌ వ్యవహారం మీద ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామదేవత ఉత్సవాల్లో విచ్చలవిడి జూదాన్ని ప్రభుత్వం.. చట్టం అనుమతించదు. ఇది నేరం కూడా. అలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను చూస్తూ ఉపేక్షించిన ఎస్‌ఐ కూడా దీనికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ వ్యవహారాన్ని ఎస్పీ గారికి కూడా తెలియపరిచాం. ఎస్‌ఐకి సంజాయిషీ నోటీసు ఇస్తున్నాం.

– ఎస్‌.రాఘవులు, సబ్‌ డివిజన్‌ పోలీస్‌ ఆఫీసర్‌, చీపురుపల్లి.

పోలీసులు నైట్‌ పెట్రోలింగ్‌ ఎందుకు చేస్తారు..? ఊళ్లో దొంగలు.. ఆకతాయిలు.. రౌడీలు ఏమైనా అసాంఘిక కలాపాలు.. తప్పుడు పనులు చేస్తారేమో అని చూసి.. వాళ్లను పట్టుకుని ప్రజల ఆస్తులకు భద్రతా కల్పించడానికి రాత్రి గస్తీ తిరుగుతారు. కానీ ఈ ఎస్సై ఈ మధ్య గస్తీ తిరుగుతూ అర్థరాత్రి నిద్ర మానుకుని గస్తీ తిరిగితే ఏమీ గిట్టుబాటు కాకపోతే ఎలా అనుకున్నాడో ఏమో.. ఒక షాప్‌ ముందు పార్క్‌ చేసి ఉంచిన బులెట్‌ బైక్‌ను స్టేష్టన్‌కు పట్టుకెళ్లిపోయారు. మర్నాడు బాధితులు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కమలాసన్‌ రేంజిలో యాక్టింగ్‌ మొదలెట్టి అరె.. అగ్ని.. అగ్ని.. ఇక్కడ.. నేను ఉండగా దొంగతనామా.. తేల్చేద్దామ్‌.. అని తల అటూ ఇటూ తిప్పి.. నీ బైక్‌ రాజమండ్రిలో ఉన్నట్లు తెలిసింది.. దాన్ని తేవాలంటే పాతిక వేలు అవుతుంది అని చెప్పారు.. ఓహో అనుకుంటూ బాధితులు ఇంటికి వచ్చేసారు. తరువాత చూస్తే ఆ బైక్‌ చీపురుపల్లి స్టేషన్లోనే ఉంది. ఈ దొంగ పోలీస్‌ అంశం పెద్ద వివాదాస్పదం అయింది. అయినా సరే చీపురుపల్లికి నేనే పోలీస్‌.. అంతా నేనే..అంటూ ఆయన వీరవిహారం చేస్తున్నారు.

పోలీస్‌ దందా..! 1
1/8

పోలీస్‌ దందా..!

పోలీస్‌ దందా..! 2
2/8

పోలీస్‌ దందా..!

పోలీస్‌ దందా..! 3
3/8

పోలీస్‌ దందా..!

పోలీస్‌ దందా..! 4
4/8

పోలీస్‌ దందా..!

పోలీస్‌ దందా..! 5
5/8

పోలీస్‌ దందా..!

పోలీస్‌ దందా..! 6
6/8

పోలీస్‌ దందా..!

పోలీస్‌ దందా..! 7
7/8

పోలీస్‌ దందా..!

పోలీస్‌ దందా..! 8
8/8

పోలీస్‌ దందా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement