గోపాలపల్లిలో ఏమిటీ దారుణం!
కేసు నమోదు
గోపాలపల్లిలో గోవధ
ఆవుల్ని అడ్డంగా నరికేస్తున్నారు..
గోస్తనీలో కళేబరాలు కప్పేస్తున్నారు..
కాపుకాసి బయటపెట్టిన గ్రామస్తులు
ఉద్యోగులు, పెద్దల అండతోనే అరాచకం
విశ్వమానవాళికి ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుని మరోపేరు గోపాలుడు. గోపాలుని పేరనున్న గోపాలపల్లి గ్రామంలో మాత్రం నిత్యం గోవధ యథేచ్ఛగా సాగుతోంది. ఐదు నెలలుగా గొంతులు కోసే వేళ గోమాతల ఆర్తనాదాలతో, గోకళేబరాలతో గోస్తనీ తీరం ఎరుపెక్కుతోంది. గోస్తనీ జలాలు విషతుల్యం అవుతున్నాయి. ఉద్యోగుల నిర్లక్ష్యంతో గోవుల అరుపులు, గోస్తనీ గుండె చప్పుళ్లు నిశీధిలో కలిసిపోతున్నాయి.
చేశారని ప్రశ్నిస్తే మాకేమీ తెలియదని చెప్పారు. గ్రామంలో ఏం జరిగినా పట్టించుకోని గుడ్డి వ్యవస్థ నడుస్తోందని, అధికారులకి అన్నీ తెలుసని పెద్దల అండతోనే అన్నీ సాగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.
గోస్తనీలో జంతు కళేబరాలు
గోపాలపల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాలో ఆవుల్ని నరికేసిన తర్వాత మిగిలిన కళేబరాలు, తోళ్లను పక్కనే ఉన్న గోస్తనీ నదిలో రెండు అడుగుల మేర గోతులు తీసి పూడ్చేశారు. గోస్తనీలో ఉన్న కళేబరాలను, దుమ్ములను గ్రామస్తులు మీడియాకు చూపారు. గోస్తనీ నదిలో నీటిని చెలమలు తీసుకు ని తాగటానికి వాడుకుంటున్నామని, నది నీటిని ఇలా అన్యాయంగా పాడు చేశారని, ప్రభు త్వంలో పెద్దలు, గ్రామ ఉద్యోగులు అండతోనే ఇదంతా జరుగుతోందని మహిళలు శాపనార్ధాలు పెట్టారు. అక్రమ షెడ్‌ను కూల్చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. కళ్లు, చెవులు మూసుకుని పాలన సాగిస్తున్న జిల్లా యంత్రాంగం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి గౌరమ్మ, వీఆర్వో అప్పలరాజు, ఎస్.ఐ చంద్రశేఖర్ తదితరుల సమక్షంలో పంచనామా చేసి గో కళేబరాలను పూడ్చి పెట్టారు.
శృంగవరపుకోట :
మండలంలోని గోపాలపల్లి గ్రామంలో అడ్డగోలుగా ఆవుల్ని నరికేస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఈ వ్యాపారం ఐదు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. షీప్ ఫారం పెట్టి దాని చాటున విశాఖకు చెందిన సుల్తాన్, షేక్‌భాషా లు యథేచ్ఛగా ఆవుల్ని నరికి మాంసం వ్యాపారం సాగిస్తున్నారు. శనివారం రాత్రి గ్రామానికి చెందిన అల్లూరి కిషోర్‌రాజు, తగరంపూడి రమణ, ఇప్పిలి నాయుడు, ఉప సర్పంచ్ గణేష్, మళ్లా రమేష్, మళ్ల సూరిబాబు, ఆవుల ఆర్తనాదాలు విని అర్ధరాత్రి 1 గంట వేళలో షీప్ ఫారం వద్దకు వెళ్లగా ఏడుగురు వ్యక్తులు మూడు ఆవుల్ని నరికేసి మాంసం తీసే పనిలో ఉండటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్‌ఐ రావటంతో ఆయన వెంట షీప్ ఫారం వద్దకు వెళ్లి కేకలు వేయటంతో కొందరు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు సుల్తాన్, భాషాలను అదుపులోకి తీసుకున్నారు. తెల్లవార్లూ ఘటనాస్థలిలో గ్రామానికి చెందిన కొందరు కాపు కాశారు. ఆవుల్ని నరికేస్తున్నారని తెలిసి ఊరంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. మహిళలు వచ్చి గోకళేబరాలు చూసి ఊరికే అరిష్టం అని కంటనీరు పెట్టుకున్నారు.
అడ్డగోలు వ్యాపారానికి అండగా..
గోపాలపల్లిలో ఏర్పాటు చేసిన షీప్ ఫారంకు పంచా యతీ నుంచి ఎలాంటి అనుమతులు, ప్లాన్ అప్రూవ ల్స్ లేకున్నా అక్రమ నిర్మాణాన్ని, దొంగచాటు వ్యాపారాన్ని గ్రామ స్థాయి ఉద్యోగులు లంచాల మత్తులో ఏనాడూ అడ్డుకోలేదు. ఇంటి కోసమని తీసుకున్న విద్యుత్ కనెక్షన్‌ను షీప్ ఫారం కోసం వాడుకుంటున్నా విద్యుత్ అధికారులూ పట్టించుకోలేదు. ఆర్నెళ్ల క్రితం షెడ్ నిర్మాణం అడ్డుకున్నామని చెప్పిన వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు తర్వాత ఎందుకు వదిలేశారంటే సమాధానం లేదు. ఐదు నెలలుగా సాగుతున్న గోవధను ఎందుకు నిర్లక్ష్యం
గోపాలపల్లి గ్రామంలో గొర్రెల పెంపకం పేరుతో అక్రమంగా కబేళా నడుపుతూ గోవధకు పాల్పడుతున్న సుల్తాన్, షేక్ భాషాలపై కేసు నమోదు చేశామని సీఐ నారాయణమూర్తి చెప్పా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
గోపాలపల్లిలో ఏమిటీ దారుణం!


