నిధులున్నా.. నిర్లక్ష్యం..!
మహిళ మార్ట్‌లు ఏర్పాటులో.. నిధులున్నా ఏర్పాటు చేయని వైనం 27 మండలాలకు రెండు చోట్ల మాత్రమే ఏర్పాటు మార్ట్‌లు ఏర్పాటుకు సేకరించిన నిధులు రూ.10.10 కోట్లు ఒక్కో మండలం నుంచి రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు వసూలు
నిధులున్నా..
నిధులు లేకపోతే ఏదైనా కార్యక్రమం చేపట్టలేక పోవచ్చు. కానీ కోట్లాది రుపాయిలు నిధులు ఉన్నప్పటకీ మహిళ మార్ట్‌లు ఏర్పాటు చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా యి. స్వయం సహాయక సంఘాల మహిళలతో మార్ట్‌లు ఏర్పాటు చేయడం ద్వారా వారు ఆర్థికాభివృద్ధితో పాటు వ్యాపార వేత్తలుగా అవుతారన్న ది లక్ష్యం. ఉపాధి కూడా దొరుకుతుంది. టీడీపీ సర్కార్ మాటల్లో చూపించినశ్రద్ధ చేతల్లో చూపించడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
జిల్లాలో 40,203 గ్రూపులు
జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 40,203 ఉన్నాయి. ఇందులో ఎస్సీ సంఘాలు 3,751 ఉన్నాయి. ఎసీ్ట్రగూపులు 731, బీసీ 34,639, ఓసీ 1063, మైనార్టీ గ్రూపులు 19 ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల్లో 4,34,776 మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఎస్సీ సభ్యులు 39,614 మంది, ఎస్టీ 7,911 మంది, బీసీలు 3,75,719 మంది, ఓసీలు 11,237 మంది మైనార్టీలు 186 మంది ఉన్నారు.
విజయనగరం ఫోర్ట్:
అధికారంలోకి వస్తే మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడతామని, వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పింది. ఎన్నికల సమయంలో మహిళలను లక్షాధికారులను చేస్తాం.. వారికే పెద్దపీట వేస్తాం... అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు, టీడీపీ నాయకులు అంతా గొప్పగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ను పట్టించుకోవడం లేదని, కూటమి నేతలు తమను మోసం చేస్తున్నారని మహిళలు ఆరోపి స్తున్నారు.డ్వాక్రా మహిళలకు ఇస్తామన్నా సున్నా వడ్డీ ఎగ్గొట్టారు. ఎస్సీ, ఎస్టీల స్వయం సహాయక సభ్యులకు ఇచ్చే ఉన్నత రుణాలను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. మహిళ మార్ట్‌ల ఏర్పాటులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రెండు చోట్లే ఏర్పాటు
మహిళలను వ్యాపారవేత్తలుగా చేయాలనే ఉద్దేశంతో ప్రతీ మండలంలో మహిళ మార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో రెండు చోట్ల మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. మిగిలిన 25 మండలాల్లో ఏర్పాటు చేయలేదు. గరివిడి, ఎస్. కోటల్లో మహిళ మార్ట్‌లు ఏర్పాటు చేశారు. మహిళ మార్ట్‌లు ఏర్పాటు కోసం ప్రతి డ్వాక్రా మహిళ నుంచి రూ.310 చొప్పన వసూలు చేశా రు. ఒక్కో మండలం నుంచి సుమారు రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా రూ.10.10 కోట్లు వసూలు చేశారు.
మార్ట్‌లు ఏర్పాటుకు నిధులు ఉన్నాయి. ఎస్.కోట, గరివిడి మండలాల్లో మార్ట్‌లు నడుస్తున్నాయి. మిగిలిన మండలాల్లో కూడా మార్ట్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస పాణి, పీడీ, డీఆర్‌డీఏ
నిధులున్నా.. నిర్లక్ష్యం..!


