ఏఐ ఇండియా సమ్మిట్‌లో చీపురుపల్లి విద్యార్థుల ప్రతిభ
విజయనగరం అర్బన్:
న్యూఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక ఏఐ ఇండియా సమ్మిట్‌లో చీపురుపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశాలకు చెందిన ఆర్.హర్షిత (9వ తరగతి), పి.వి.ఎల్.ప్రణవి (8వ తరగతి) ఏఐ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పాఠశాలలో ఏఐ అభ్యసన అనుభవాలను వివరించారు. జాతీయ స్థాయిలో ఏఐ ప్రాజెక్టులతో ఆకట్టుకున్న బాలికలతో పాటు గైడ్ టీచర్స్ ఎ.వి.ఆర్.డి. ప్రసాద్, పి. అనూరాధలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు, జిల్లా సైన్స్ అధికారి రాజేష్, హెచ్‌ఎం ధనుకొండ ఉమామహేశ్వరి అభినందించారు. ఇక్కడి పాఠశాలలో గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏఐ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రొగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇన్నోవేషన్ వంటి ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇప్పించింది. విద్యార్థులు ఏఐలో రాణిస్తుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.


