మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎమ్మెల్సీల పరామర్శ
నెల్లిమర్ల రూరల్: మాజీ మంత్రి అంబటి రాంబాను ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు, పాలవలస విక్రాంత్ బుధవారం పరామర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇటీవల అరెస్టు కాబడి బెయిల్‌పై విడుదలైన రాంబాబును గుంటూరులోని ఆయన నివాసంలో కలిసి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలనే ధోరణి సరికాదన్నారు. మాజీ మంత్రిని అన్యాయంగా అరెస్ట్ చేసి, ఇంట్లో మహిళలు ఉన్న సమయంలో దాడికి తెగబడడం బాధాకరమన్నారు. అక్రమ అరెస్ట్‌లతో ప్రశ్నించే గొంతులను ఆపలేరన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


