చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా బొబ్బిలిలో అంగన్‌వాడీల మానవహారం
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనలను అడ్డుకోవడం, అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికారమిస్తే అరెస్టుచేస్తారా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. తక్షణమే అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలు పెంచాలని, మినీ కేంద్రాలన్నీ మెయిన్ కేంద్రాలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రెండు జిల్లాల్లోని కలెక్టరేట్‌లు, కాంప్లెక్స్‌లు, ప్రధాన కూడళ్లలో మానవహారాలు నిర్వహించి తమ నిరసన గళం వినిపించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
– విజయనగరం ఫోర్ట్/బాడంగి/బొబ్బిలి/బలిజిపేట


