టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. బొబ్బిలిలో కిలో టమాటా రూ.3లు పలుకుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. 25 కిలోల బరువున్న కేట్ టమాటాలు బొబ్బిలి మార్కెట్‌లో రూ.60 నుంచి రూ.75 పలుకుతోందంటూ గొల్లపల్లి, పాతబొబ్బిలి, మల్లంపేట, మెట్టవలస, పారాది, గొర్లె సీతారాంపురం, రంగరాయపురం, దిబ్బగుడివలస తదితర గ్రామాల రైతులు వాపోతున్నారు. ఆటోచార్జీ తీసేస్తే కిలోకు రైతు చేతికి రూ.2 వస్తోందన్నారు. బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పంట కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – బొబ్బిలి


