ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సంఘ జిల్లా కార్యదర్శి బొత్స సుధారాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ కె.రాణికి వినతి పత్రం అందజేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌ను ఆశ వర్కర్లుగా మార్చాలన్నారు. సమాన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు.
అన్నిరకాల సెలవులు మంజూరు చేయాలని, దహన సంస్కారాల ఖర్చులు చెల్లించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశ వర్కర్ల సంఖ్యను పెంచాలని, పీహెచ్‌సీకి వెళ్లిన ప్రతి సందర్భంలో టీఏ, డీఏలు ఇవ్వాలని, రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పించాలని, నాణ్యమైన మొబైల్స్, యూనిఫాం ఇవ్వాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 5వ తేదీన విజయవాడలో ధర్నా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో డి.ఆశాభాను, కె.సత్యవతి, వి.మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్


