రామతీర్థంలో వైభవంగా పునర్వసు నక్షత్ర పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో శ్రీమద్రామాయణ పారాయణం నిర్వహించి ఆస్థాన మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేక సర్గ విన్నవించి శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పట్టాభిషేక మహోత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


