సీఎం పర్యటనకు 1200 మంది పోలీసులతో బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు 1200 మంది పోలీసులతో బందోబస్తు

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 7:05 AM

సీఎం

సీఎం పర్యటనకు 1200 మంది పోలీసులతో బందోబస్తు

మార్చి 2న అంగన్‌వాడీల మహాధర్నా

● రావివలస వద్ద హెలిప్యాడ్‌ను పరిశీలించిన రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి

విజయనగరం క్రైమ్‌: చీపురుపల్లి మండలం రావివలసలో పింఛన్ల పంపిణీ, వ్యాక్సిన్‌ ప్రారంభం కోసం సీఎం చంద్రబాబునాయుడు శనివారం రానున్నారు. దీనికోసం 1200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి శుక్రవారం తెలిపారు. ఏర్పాట్లను ఇన్‌చార్జి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్‌, సభాస్థలం, పార్కింగ్‌, కాన్వాయ్‌ వెళ్లే మార్గాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలా రావు, ఇతర పోలీస్‌ అధికారులు, పాల్గొన్నారు.

పెద్దల ఆక్రమణలో ప్రభుత్వ భూమి

సీతానగరం: మండలంలోని బగ్గందొరవలస గ్రామంలోని ప్రభుత్వ భూమిపై పెద్దల కన్ను పడింది. అంతే.. యంత్రాలతో పగలురాత్రీ తేడా లేకుండా చదును చేయించేస్తున్నారు. రూ.కోట్ల విలువైన భూమిని సాగుభూమిగా మార్చేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... బగ్గందొరవలస గ్రామంలో 1/1 సర్వే నంబర్‌లో 15.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానిని గయ్యాల భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదుచేశారు. దానిపై పెద్దల కన్నుపడింది. అధికార బలంతో జేసీబీల సాయంతో చదును చేసేశారు. పనిలోపనిగా పక్కనే ఉన్న మరో 4.84 ఎకరాల భూమిని ఆక్రమణదారుల చేతుల్లోకి తీసుకున్నారు. 1/8లో 1.11 ఎకరాలు, 1/10 లో 1.04 ఎకరాలు, 1/11లో 1.11 ఎకరాలు, 1/14లో 1.14 ఎకరాలు, 2/1లో 0.44 ఎకరాల భూమి బ్యాంకర్ల వేలంలో రాజమండ్రికి చెందిన భద్రగిరి దివాకర్‌ దక్కించుకున్నారు. దివాకర్‌ సంబంధిత భూమిని ఎవరికి అప్పగించారా? విక్రయించారా? తెలియదు కానీ లోకాయుక్తలో ఉన్న భూమిపై ఉన్నమట్టిని తీయడం, మడులుగా తయారుచేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆ భూమి కూడా వదలకుండా చదునుచేస్తున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆక్రమణల అంశాన్ని తహసీల్దార్‌ కె.ప్రసన్నకుమార్‌ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అది ప్రభుత్వ భూమి అని, ఎవరు ఆక్రమించినా శిక్షతప్పదని హెచ్చరించారు. వీఆర్వోను పంపించి ఆక్రమణలను అడ్డుకుంటామన్నారు.

పార్వతీపురం రూరల్‌: సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 2న విజయవాడలో నిర్వహించనున్న ‘మహాధర్నా’ను జయప్రదం చేయాల ని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. కలెక్టరేట్‌ వద్ద గత మూడు రోజులుగా చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి.

సీఎం పర్యటనకు 1200 మంది పోలీసులతో బందోబస్తు 1
1/1

సీఎం పర్యటనకు 1200 మంది పోలీసులతో బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement