దుబాయ్‌లో చిక్కుకున్న రేగిడి వాసి | - | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో చిక్కుకున్న రేగిడి వాసి

Mar 7 2026 9:32 AM | Updated on Mar 7 2026 9:32 AM

ఆందోళనలో

తల్లిదండ్రులు

రేగిడి: మండల పరిధిలోని సంకిలి గ్రామానికి చెందిన గుండ లావణ్యకుమార్‌ దుబాయ్‌లో చిక్కుకున్నాడు. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని జీవనోపాధి కోసం 2025 జనవరిలో దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ వెల్డర్‌ పనులు చేసుకుంటూ అబుదాబిలో ఉంటున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులు గుండ శ్రీను, భవానీలకు లావణ్యకుమార్‌ దుబాయ్‌ నుంచి ఫోన్‌ చేసి యుద్ధ వాతావరణంతో ఇక్కడ చాలా భయంగా ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేత పట్టుకుని గడుపుతున్నామని ఫోన్‌లో తెలిపాడని తల్లిదండ్రులు విలేకరులకు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు దేశం కాని దేశంలో చిక్కుకోవడం తమకెంతో బాధకలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ చొరవ తీసుకుని అబుదాబిలో ఉన్న తమ కుమారుడుని సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చేవిధంగా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement