ప్రొఫెసర్ లోక్‌నాఽథ్‌కు గోల్డ్ మెడల్
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చెందిన ఎముకల విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ లాడి లోక్‌నాథ్ గోల్డ్ మెడల్ సాధించారు. కర్నూల్‌లో కొద్ది రోజులు క్రితం 56వ ఎముకల వైద్యుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రానికి చెందిన సీనియర్ ఎముకలు వైద్యులు 20 మంది పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వీరిలో గోల్డ్ మోడల్ పేపర్‌గా డీఆర్‌యూజే సమస్యకు పరిష్కారాన్ని డాక్టర్ లోక్‌నాఽఽథ్ కనుగొన్నారు. ఇందుకుగాను ప్రెస్టీజియస్ వాగ్యేశ్వరుడు మోమోరియల్ గోల్డ్‌మెడల్‌ను ఆయనకు అందించారు. ఈ మేరకు లోక్‌నాఽథ్‌ను సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. కార్యక్రమంలో ఎముకల విభాగం వైద్యులు బాలాజీ, వంశీకృష్ణ, ప్రభు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చెక్‌బౌన్స్ కేసులో జైలుశిక్ష
గజపతినగరం రూరల్: చెక్‌బౌన్స్ కేసులో నిందితుడు పూసర్ల రామలింగేశ్వరరావుకు ఏడాది జైలు, రెండు లక్షల 40 వేల రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.విజయ్‌రాజ్‌కుమార్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు కార్యాలయ సిబ్బంది అందించిన వివరాలు.. గజపతినగరానికి చెందిన కొల్లా కనకవెంకట సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన పూసర్ల రామలింగేశ్వరరావుకు 2022లో 2 లక్షల 40 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇందుకు బదులుగా రామలింగేశ్వరరావు రూ.2,40,000 మొత్తానికి సత్యనారాయణకు చెక్కు అందజేశాడు. ఈ చెక్కు బ్యాంకులో బౌన్స్ కావడంతో సత్యనారాయణ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో అనేక వాదోపవాదాలు అనంతరం స్థానిక మెజిస్ట్రేట్ విజయ రాజ్‌కుమార్ ఈ కేసుకు సంబంధించి పై విధంగా తుది తీర్పు వెల్లడించారు.
పూరిల్లు దగ్ధం
గుర్ల: మండలంలోని పల్లిగండ్రేడులో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పెనుమాల రాములమ్మ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. రాములమ్మ గురువారం తెల్లవారుజామున కర్రల పొయ్యిలో వంట చేస్తుండగా అగ్ని జ్వాలలు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో పురిల్లుకు తాకాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూరిల్లు మొత్తం కాలిపోయింది. స్థానికులు వచ్చి మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో సుమారుగా రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు గొల్లుమంది. ప్రమాదం జరిగిన పురిల్లును రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా
విజయనగరం క్రైమ్ : మద్యం సేవించి బైక్ నడిపి, పట్టుబడిన వాహనదారుల ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి ఆదేశాలు ఇచ్చారని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది డీడీలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 53 కేసులు నమోదు చేశారు. వారందరినీ విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా మొత్తం 53 మందికి రూ.5.30 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు. మూడు నెలల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలుశిక్ష పడిందన్నారు.
హత్యాయత్నం కేసులో
వ్యక్తి అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి గంట్యాడలో ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కాళ్ల వెంకటరమణపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశామని సీఐ లక్ష్మణరావు గురువారం తెలిపారు. మద్యం సేవించి కానిస్టేబుల్‌పై దాడి చేసి ఆపై హత్యాయత్నం చేశాడని సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు గంట్యాడలో అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ కోర్టు విధించిందని సీఐ లక్ష్మణరావు పేర్కొన్నారు.
ప్రొఫెసర్ లోక్‌నాఽథ్‌కు గోల్డ్ మెడల్


