అంతర్‌వర్సిటీ చెస్‌ పోటీలకు జీఎంఆర్‌ ఐటీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌వర్సిటీ చెస్‌ పోటీలకు జీఎంఆర్‌ ఐటీ విద్యార్థులు

Mar 1 2026 7:19 AM | Updated on Mar 1 2026 7:19 AM

అంతర్

అంతర్‌వర్సిటీ చెస్‌ పోటీలకు జీఎంఆర్‌ ఐటీ విద్యార్థులు

రాజాం సిటీ: తమిళనాడు రాష్ట్రం భారతీదశన్‌ యూనివర్సిటీలో ఈ నెల 2 నుంచి 5 వరకు జరగనున్న అంతర్‌ విశ్వవిద్యాలయాల చెస్‌ పోటీలకు జీఎంఆర్‌ ఐటీ విద్యార్థులు షణ్ముఖ శ్రీనివాస్‌, మణికంఠ ఎంపికై నట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌ శనివారం తెలిపారు. ఇటీవల టెక్కలి ఐతమ్‌ కళాశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారన్నారు. చెస్‌ జట్టుకు కెప్టెన్‌గా షణ్ముఖ శ్రీనివాస్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.గిరీష్‌, స్టూడెంట్స్‌ డీన్‌ డాక్టర్‌ వి.రాంబాబు, పీడీ బీహెచ్‌ అరుణ్‌కుమార్‌, విద్యార్థులు అభినందించారు.

టీచర్‌కు ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

విజయనగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8వ తేదీ) పురస్కరించుకుని హైదరాబాద్‌లో పాన్‌ ఇండియన్‌ సోషియో కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాల్లో అందజేసే ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన సముద్రాల గిరిజా ప్రసన్న ఎంపికయ్యారు. హర్యానా పూర్వ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె, తెలంగాణా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ సురభివాణిదేవి, సినీనటి ఆమని తదితరుల చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఉపాధ్యాయ, సామాజిక రంగంలో చేస్తున్న కృషికి ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు.

అంతర్‌వర్సిటీ చెస్‌ పోటీలకు జీఎంఆర్‌ ఐటీ విద్యార్థులు 1
1/2

అంతర్‌వర్సిటీ చెస్‌ పోటీలకు జీఎంఆర్‌ ఐటీ విద్యార్థులు

అంతర్‌వర్సిటీ చెస్‌ పోటీలకు జీఎంఆర్‌ ఐటీ విద్యార్థులు 2
2/2

అంతర్‌వర్సిటీ చెస్‌ పోటీలకు జీఎంఆర్‌ ఐటీ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement