గిరిజనదారుల్లో ప్రసవ వేదన | - | Sakshi
Sakshi News home page

గిరిజనదారుల్లో ప్రసవ వేదన

Mar 1 2026 7:19 AM | Updated on Mar 1 2026 7:19 AM

గిరిజనదారుల్లో ప్రసవ వేదన

గిరిజనదారుల్లో ప్రసవ వేదన

ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది

మార్గంమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ

కొమరాడ: గిరిజన గ్రామాల గర్భిణులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. పురిటి కష్టాలు వీడడం లేదు. రాళ్లదారుల్లోనే నరకయాతన పడుతూ పిల్లలకు జన్మనిస్తున్నారు. దీనికి కొమరాడ మండలంలో శనివారం చోటుచేసుకున్న ఘటనే నిలువెత్తు నిదర్శనం. పూడేసు పంచాయతీ కోన గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆరిక వనితకు తెల్లవారు జామున పురిటినొప్పులు వచ్చాయి. కూనేరు రామభద్రపురం ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు

కుటుంబ సభ్యులు వెంటనే ఫీడర్‌ అంబులెన్స్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు చేరుకునేసరికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే పురిటినొప్పులు ఎక్కువైనా... ఆస్పత్రికి చేర్చేదారిలేక అంబులెన్స్‌లోనే తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. కప్పలవాడు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళల సాయంతో ప్రసవం జరిపారు. ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యసేవల కోసం ఇద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement