విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బొలెరో వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బొలెరో వ్యాన్‌

Feb 26 2026 9:18 AM | Updated on Feb 26 2026 9:18 AM

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బొలెరో వ్యాన్‌

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బొలెరో వ్యాన్‌

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బొలెరో వ్యాన్‌ చికెన్‌

చికెన్‌

మూడు బైక్‌ల ధ్వంసం

మహిళకు తీవ్ర గాయాలు

బొండపల్లి: వర్షం పడుతుందని తాటాకు టీకొట్టులో తలదాచుకున్న మహిళపై విద్యుత్‌ స్తంభం పడడంతో తీవ్ర గాయాలు కావడంతో పాటు మూడు బైక్‌లు ధ్వంసం అయిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని బిల్లలవలస జంక్షన్‌ వద్ద పూరి పాకలో నిర్వహిస్తున్న టీకొట్టుకు అనుకోని ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని మానాపురం నుంచి విజయనగరం పశువులు లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్‌ స్తంభం విరిగి పడటంతో అక్కడ పార్కు చేసి ఉన్న మూడు బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే ప్రమాదంలో విజయనగరంలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన రెడ్డి సింహచలంకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో విజయనగరంలోని కేంద్ర ఆస్పత్రికి తరలించారు. స్తంభాన్ని ఢీకొట్టిన తరువాత వ్యాన్‌ డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పరారైనట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement