కష్టపడ్డారు.. | - | Sakshi
Sakshi News home page

కష్టపడ్డారు..

Mar 3 2026 7:34 AM | Updated on Mar 3 2026 7:34 AM

కొలువులు సాధించారు..

ఒక్కొక్కరికీ నాలుగేసి బ్యాంక్‌ పోస్టులు

బొబ్బిలి: వారంతా కష్టాన్ని నమ్ముకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఒకేసారి నాలుగేసి ఉద్యాగాలకు ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. బొబ్బిలి పట్టణంలోని నాయుడు కాలనీకి చెందిన కళ్యంపూడి భానుప్రకాష్‌ ఎన్‌ఐటీలో చదువు పూర్తి చేసి నాలుగు నెలలుగా బ్యాంక్‌ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. మొదటి ప్రయత్నంలోనే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పీఓగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ పీఓగా, ఎస్‌బీఐ క్లర్క్‌గా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లర్క్‌గా ఎంపికయ్యాడు. భానుప్రకాష్‌ తండ్రి సూర్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి జయలక్ష్మి గృహిణి. అలాగే ఇదే కాలనీకి చెందిన పెంట రాకేష్‌కుమార్‌ కూడా కెనరా బ్యాంక్‌ పీఓగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ పీఓగా, ఎస్‌బీఐ క్లర్క్‌గా, యూనియన్‌ బ్యాంక్‌ క్లర్క్‌గా ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికయాడు. ఈయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి సుశీల గృహిణి. దీంతో విజేతలను పలువురు అభినందిస్తున్నారు.

గృహిణిగా ఉంటూ...

చీపురుపల్లికి చెందిన మారోజు గాయత్రి స్థానిక నాయుడు కాలనీలో నివసిస్తోంది. ఈమె బీఎస్పీ చదువుకుంది. తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సపర్యలు చేసుకుంటూ ఎటువంటి కోచింగ్‌ లేకుండా ఇంటివద్దనే పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోంది. ఈక్రమంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జూనియర్‌ మేనేజర్‌గా ఎంపికై ంది. దీంతో ఈమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement