సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు

Feb 27 2026 4:07 AM | Updated on Feb 27 2026 4:07 AM

సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు

సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు

విజయనగరం క్రైమ్‌: చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీలో ఈ నెల 28న సామాజిక పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబునాయుడు రానున్నారు. ఈ మేరకు భద్రతాఏర్పాట్లను ఇన్‌చార్జి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి గురువారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన స్థలాన్ని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందరరెడ్డి, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పరిశీలించారు. హెలిప్యాడ్‌, ప్రజావేదిక, పెన్షన్లు పంపిణీ చేసే ఇళ్లు, కార్యకర్తలతో సమావేశం కానున్న ప్రాంగణాన్ని సందర్శించారు. పరిశీలనలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు, సీఐ జి.శంకరరావు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement