స్కూల్‌ బ్యానర్‌ కడుతున్న యువకునికి విద్యుత్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బ్యానర్‌ కడుతున్న యువకునికి విద్యుత్‌ షాక్‌

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

స్కూల

స్కూల్‌ బ్యానర్‌ కడుతున్న యువకునికి విద్యుత్‌ షాక్‌

స్కూల్‌ బ్యానర్‌ కడుతున్న యువకునికి విద్యుత్‌ షాక్‌

తృటిలో తప్పిన ప్రాణాపాయం

11 కేవీ పక్కనే ఏర్పాటు చేసిన హోర్డింగ్‌

వీరఘట్టం: స్థానిక మేజరు పంచాయతీలోని తెలగవీధి మలుపు వద్ద ఓ బిల్డింగ్‌పై ఉన్న హోర్డింగ్‌పై స్కూల్‌ బ్యానర్‌ కడుతున్న శివ అనే యువకునికి విద్యుత్‌ షాక్‌ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ బ్యానర్‌ కడుతుండగా పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైర్లు పాక్షికంగా యువకునికి తగలగా హోర్డింగ్‌ నుంచి కింద పడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. కరెంట్‌ షాక్‌ తగలడంతో యువకుని వీపు భాగం బాగా కాలిపోయింది. ప్రమాదం బిల్డింగ్‌పైన జరగడంతో ఎవరూ పైకి వెళ్లేందుకు మార్గం లేక సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. అటుగా వస్తున్న కిమ్మి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ నేదూరి శంకరరావు వెంటనే బిల్డింగ్‌ పైకి ఎక్కి క్షతగాత్రుడు శివను లైన్‌మెన్‌ అప్పలనాయుడు సహయంతో కిందకు దించాడు. తన ఆటోలో వీరఘట్టం పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందేలా చేశాడు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుడుని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడడంతో పాటు ఆసుపత్రికి తన ఆటోలో తీసుకువెళ్లిన డ్రైవర్‌ శంకరరావును అందరూ అభినందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడు బలజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన పెదపెంకి శివగా గుర్తించారు.

ప్రమాదకరంగా హోర్డింగ్‌...

స్థానిక మేజరు పంచాయతీలోని తెలగవీధి జంక్షన్‌ వద్ద ఓ బిల్డింగ్‌పై కడుగుతున్న హోర్డింగ్‌ ప్రమాదకరంగా ఉందని, పక్కనే 11 కేవీ విద్యుత్‌ వైర్లు ఉన్నాయని, అనుమతులు లేకుండా కడుతున్న ఈ హోర్డింగ్‌ను తొలగించాలని ఈ నెల 13న సాక్షిలో కధనం ప్రచురితమైంది. సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. మరో ప్రమాదం జరగక ముందే పంచాయతీ అధికారులు, ట్రాన్స్‌కో అధికారలు స్పందించి ఈ హోర్డింగ్‌ను తొలగించాలని పలువురు కోరుతున్నారు.

స్కూల్‌ బ్యానర్‌ కడుతున్న యువకునికి విద్యుత్‌ షాక్‌1
1/1

స్కూల్‌ బ్యానర్‌ కడుతున్న యువకునికి విద్యుత్‌ షాక్‌

Advertisement
 
Advertisement
Advertisement