సర్వేత్రా ఆందోళన.. | - | Sakshi
Sakshi News home page

సర్వేత్రా ఆందోళన..

Mar 8 2026 7:13 AM | Updated on Mar 8 2026 7:13 AM

న్యూస్‌రీల్‌

విజయనగరం
అతివ దుఃఖీభవ..!

● సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.

● జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్లలో కనీసం 70 శాతం మందికి గ్రేడ్‌–1 ప్రమోషన్‌ ఇవ్వాలి.

● గ్రామ సర్వేయర్‌ పోస్టుకు ఉన్న అర్హతను పెంచి ఐటీఐ స్థానంలో డిప్లమో లేదా బీటెక్‌(సివిల్‌) అర్హతగా నిర్ణయించాలి.

● రీ–సర్వేలో సాంకేతిక పనులు నిర్వహిస్తున్నవారికి టెక్నికల్‌ అలెన్స్‌ ఇవ్వాలి.

● ఫీల్డ్‌లో చేసే పనులకు టీఏ, డీఏతో పాటు ఇతర ఫీల్డ్‌ అలవెన్సులు చెల్లించాలి.

● ఏడేళ్ల సర్వీసు పూర్తయితే ఉద్యోగోన్నతలు

కల్పించాలి.

ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026

విజయనగరం గంటస్తంభం: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్ల కలెక్టరేట్‌ వేదికగా ఆందోళనకు దిగారు. రెండోరోజు శనివారం కూడా చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపించారు. కలెక్టరేట్‌ లోపల ధర్నా చేపట్టేందుకు ప్రయత్నించిన సర్వేయర్లను పోలీసులు అడ్డుకొని బయటకు నెట్టివేయడంతో ప్రధాన ద్వారం వద్దే ధర్నా కొనసాగించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇటీవల ఇద్దరు గ్రామ సర్వేయర్లకు షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్‌ చేయడంపై సర్వేయర్లు మండిపడ్డారు. కారణం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం మిగతా సర్వేయర్లను భయపెట్టడానికేనంటూ ఆరోపించారు. జిల్లాలో మొత్తం 478 మంది గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లు ఉన్నారని, ఇద్దరిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. సస్పెండ్‌ చేయాలంటే అందరినీ చేయండి.. ఇద్దరిని బలిపశువులుగా చేయడం తగదని, తక్షణమే సస్పెన్షన్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. మేము కూడా ప్రభుత్వంలో భాగమే.. ప్రభుత్వ ఉద్యోగులమే అని, మాపై ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే సోమవారం చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

సర్వేయర్ల డిమాండ్లు ఇవే...

మహిళలకు చంద్రబాబు సర్కార్‌ శఠగోపం ‘పథకం’ ప్రకారం మోసం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ వీడని ఆవేదన

సస్పెన్షన్‌తో భయపెడతారా?

టమాటా పంట కొనుగోలుకు చర్యలు

కూరగాయల రైతులతో ముఖాముఖి

రైతు బజారులో విక్రయాలకు ఏర్పాట్లు

రామభద్రపురం: రైతులు పండించిన టమాటా పంటను రైతు బజారు వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసేందుకు బొబ్బిలి మార్కెట్‌ కమిటీ అధికారులు చర్యలు చేపట్టారు. టమాటా పంటకు మార్కెట్‌లో ధర లేకపోవడం, పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఇదే అంశంపై ఈ నెల 6వ తేదీన ‘రైతన్నకు కూర‘గాయాలు’ అనే శీర్షికన ‘సాక్షి’ లో ప్రచురితమైన వార్తకు వ్యవసాయమార్కెట్‌ కమిటీ కమిషనర్‌ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఏఎంసీ కార్యదర్శి కాళేశ్వరరావు, సూపర్‌వైజర్‌ తిరుపతిరావు రామభద్రపురానికి చెందిన కోట సోములు సాగుచేస్తున్న టమాటా పంటను శనివారం పరిశీలించారు. పంటను కోయకుండా వదిలేయడం చూసి అవాక్కయ్యారు. విజయనగరం రైతు బజారు వ్యాపారులు నేరుగా ఇక్కడి టమాటా పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. పంటలకు ధరలు లేకపోవడం వాస్తవమేనన్నారు.

కలెక్టరేట్‌ వద్ద సర్వేయర్ల నిరసన

డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం

కూటమి ప్రభుత్వం వైఖరిపై మండిపాటు

కలెక్టరేట్‌ లోపల ధర్నాను అడ్డుకున్న పోలీసులు

స్పందించకపోతే సోమవారం

చలో విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement