రూ.1.32 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.1.32 కోట్లు

Mar 5 2026 7:44 AM | Updated on Mar 5 2026 7:44 AM

ప్రభుత్వంపై నమ్మకం లేక...

గతేడాది బీమా ప్రీమియం

చెల్లించిన మామిడి,

జీడిమామిడి రైతులు

10,670 మంది

రైతులు చెల్లించిన ప్రీమియం మొత్తం

జిల్లాలో సాగులో ఉన్న మామిడి పంట

32 వేల హెక్టార్లు

గతేడాది పంటల బీమా రాకపోవడంతో ఈ ఏడాది ఒక్క రైతు కూడా బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదు. బీమా ప్రీమియం వసూలులో చూపుతున్న శ్రద్ధ చెల్లింపులో ప్రభుత్వం చూపడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఒక్క రైతు కూడా బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది.

జిల్లాలో సాగులో ఉన్న

జీడి మామిడి పంట

5,600 హెక్టార్లు

విజయనగరం ఫోర్ట్‌:

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. విపత్తు సమయంలో సాయం అందక విలవిల్లాడుతున్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసిన కూటమి సర్కారు.. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోయినా పరిహారం అందించడంలో నిర్లక్ష్యంవహిస్తోంది. రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. ఉద్యానసాగును ప్రోత్సహిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు వాస్తవానికి భిన్నమని, విపత్తుల సమయంలో ఎలాంటి సాయం అందడంలేదంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. బీమా కంపెనీ నుంచి రైతులకు చెల్లించాల్సిన బీమా సొమ్మును ఇప్పించడంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.

బీమా ప్రీమియం చెల్లించినా...

2025–26లో మామిడి తోటలకు ఎకరాకు రూ.2, జీడి మామిడి తోటలకు ఎకరాకు రూ.1500 చొప్పున రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. 10,104 మంది రైతులు 6,358 ఎకరాల మామిడితోటలకు రూ.1,27,16,000లు, జీడి మామిడి రైతులు 566 మంది 378 ఎకరాలకు రూ. 5,67,000లు బీమా ప్రీమియంగా చెల్లించారు. పంట నష్టపోతే మామిడి పంటకు ఎకరాకు రూ.40 వేలు, జీడిమామిడికి రూ.30 వేలు బీమా అందాలి. గతేడాది కొన్ని తోటలు పూర్తిగా పూతపూయకపోగా, మరికొన్నిచోట్ల తుఫాన్‌ వర్షాలకు నష్టంవాటిల్లింది. మామిడి, జీడి మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట దెబ్బతినడంతో బీమా వర్తిస్తుందని మామిడి, జీడిమామిడి రైతులు ఆశించినా ఇంతవరకు పైసా కూడా అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు బీమా ప్రీమియం డబ్బులు, మరోవైపు పంట నష్టపోయామని చెబుతున్నారు.

బీమా.. లేదండి ధీమా..!

గతేడాది పంటలు నష్టపోయిన రైతులకు అందని బీమా

ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న వైనం

ఆవేదనలో రైతాంగం

0

రైతులు నష్ట పోయారు..

గతేడాది మామిడికి ఎకరానికి రూ.2 వేలు, జీడి మామిడికి రూ.1500 చొప్పున రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. తుఫాన్‌ వర్షాలకు పంట నష్టపోయినా ఒక్క రూపాయి బీమా చెల్లించకపోవడం దారుణం. రైతులు రెండు విధాలా నష్టపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు. వారి సమస్యలను పరిష్కరించడం లేదు. – బుద్దరాజు రాంబాబు,

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

బీమా డబ్బులు అందలేదు...

ఈ ఏడాది మామిడి, జీడిమామిడి పంటలకు రైతులు పంటల బీమా ప్రీమియం కట్టలేదు. గతేడాది పంటల బీమా కోసం వివరాలు అడిగితే కమిషనర్‌ కార్యాలయానికి పలు మార్లు పంపించాం. ఒక్క రైతుకు కూడా బీమా డబ్బులు అందలేదు.

– కె.చిట్టిబాబు, జిల్లా ఉద్యానశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement