సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

Mar 5 2026 7:44 AM | Updated on Mar 5 2026 7:44 AM

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలోని ప్రతి మహిళకు భద్రత, సాధికారిత కల్పించడమే మన లక్ష్యమని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 20 వరకు నిర్వహించే కార్యక్రమం పోస్టర్లను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి డిజిటల్‌ యుగంలో మహిళలు సాంకేతికతను వినియోగించుకుంటూనే ఆన్‌లైన్‌ వేదికలపై పొంచి ఉన్న సైబర్‌ ముప్పులు పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్‌ మీడియా వేధింపులు, లోన్‌ యాప్‌ మోసాలు, ఇతర ఆన్‌లైన్‌ ఆర్థిక నేరాల నుంచి మహిళలు తమకు తాము ఎలా రక్షించుకోవాలో ఈ పోస్టర్ల ద్వారా వివరించారు. సైబర్‌ నేరాలకు గురైన వారు భయపడకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్‌, ఐసీడీఎస్‌ పీడీ కె.వెంకట బాలామణి, వన్‌స్టాప్‌ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ పి.సాయివిజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement