రైతన్నకు
● కూరగాయల ధరలు పతనం ● నష్టాల ఊబిలో రైతన్నలు ● మార్కెట్‌లో ఏ ఒక్క కూరగాయకు గిట్టుబాటు ధరలేని వైనం ● కోత ఖర్చులు రాని దుస్థితి ● పంట కోయకుండా పొలాల్లో వదిలేస్తున్న రైతులు ● రైతన్న గోడును పట్టించుకోని చంద్రబాబు సర్కారు
ఈ చిత్రంలో టమాటా పంటను
చూపిస్తున్న రైతు రామభద్రపురానికి
చెందిన కోట సోములు. ఈయన తనకున్న 50 సెంట్లలో సుమారు రూ.60 వేలు
పెట్టుబడి పెట్టి టమాటా పంటను సాగు
చేశాడు. పంట దిగుబడి బాగుండడంతో
సంతోషపడ్డాడు. పంట చేతికందే సరికి మార్కెట్‌లో ధర కిలో రూ.3లకు పడిపోవడం, పంటను కొనుగోలు చేసేవారు
లేకపోవడంతో లబోదిబోమంటున్నాడు. ఒక కూలి మనిషి రోజంతా 10 క్రేట్ల టమాటా ఏరుతుంది. వాటిని మార్కెట్‌లో విక్రయిస్తే రూ.500 నుంచి రూ.600 వస్తున్నాయి. కూలీకి రూ.300, రవాణా ఖర్చులు రూ.100, ఆశీలు రూ.100 పోతున్నాయి. రైతుకు మిగిలింది సున్నా. పంట సాగుచేసిన రైతు కుటుంబం ఎలా బతకాలి, పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి
అంటూ రైతు గగ్గోలుపెడుతున్నాడు.
కూలిఖర్చులు రాకపోవడంతో
పొలంలోనే పంటను వదిలేయాల్సి
వస్తోందంటూ కన్నీరుపెట్టాడు.


