మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఎమ్మెల్సీల పరామర్శ | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఎమ్మెల్సీల పరామర్శ

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఎమ్మెల్సీల పరామర్శ

మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఎమ్మెల్సీల పరామర్శ

మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఎమ్మెల్సీల పరామర్శ

నెల్లిమర్ల రూరల్‌: మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఎమ్మెల్సీలు డాక్టర్‌ పెనుమత్స సూర్యనారాయణరాజు, పాలవలస విక్రాంత్‌ గురువారం పరామర్శించారు. ఇటీవల కొంతమంది టీడీపీ నాయకులు, పచ్చమూకలు రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసంలో కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరి దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇంటిని తగలబెట్టి కుటుంబ సభ్యులను హతమార్చే కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలన్నారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కేసే ప్రయత్నం చంద్రబాబు సర్కార్‌కు సరికాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement